మహబూబాబాద్ రూరల్, జూలై 7: అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గిరిజన అమ్మాయి తేజావత్ సుకన్యాబాయి సత్తాచాటింది. జిల్లాలోని సిరోలు మండలానికి చెందిన సుకన్య.. పోచఫ్స్ట్రోమ్ (సౌతాఫ్రికా) వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల 76 కిలోల విభాగంలో పోటీపడ్డ ఆమె పసిడి నెగ్గింది.
స్వర్ణం గెలిచిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తి పతాకను రెపరెపలాడిస్తానని చెప్పింది. ఈ సందర్భంగా తనకు సహకరిస్తున్న కోచ్‌లు, సహాయ సిబ్బందికీ కృతజ్ఞతలు తెలిపింది. స్వర్ణం గెలిచిన సుకన్యాబాయికి జిల్లా క్రీడాకారులు అభినందనలు తెలిపారు.