Kazipet | కాజీపేట : సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సెంటింగ్ యార్డులో శనివారం ఓ యువకుడు రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగిలి షాక్‌తో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ గాంధీనగర్‌కు చెందిన పస్తం రాజు (18) తన తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి కడిపికొండ చర్చిలో జరుగుతున్న క్రైస్తవ ఉత్సవాలకు వచ్చాడు. ప్రార్థనలు జరుగుతుండగా కొందరు పిల్లలతో కలిసి రాజు రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దింగేందుకు రాంనగర్ సమీపంలోని సెంటింగ్ యార్డుకు వెళ్లాడు. యార్డులో ఆగి ఉన్న గూడ్స్ రైలు బోగీ ఎక్కి సెల్ఫీ ఫొటో దిగుతుండగా, ఒక్కసారిగా హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి షాక్ గురయ్యాడు. శరీరం కాలి కింద పడిపోయాడు. స్థానికులు 108 వాహనంలో ఎంజీఎం దవాఖానలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Gadwal | భర్తను చంపించిన భార్య.. విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు చిత్రీకరించే యత్నం
Patnam Narender Reddy | కొడంగల్‌లో ఫార్మా కంపెనీని అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
KTR | పేద ప్రజల కడుపు కొట్టడానికి సీఎం అయ్యావా..? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్