Raksha Bandhan | మంచిర్యాల : రాఖీ పండుగను సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకుంటారు. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష అన్న సంకేతాన్ని చాటి చెప్పేలా రాఖీ పండుగను ప్రతీ ఏడాది శ్రావణ పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహిస్తారు.
గురుకుల పాఠశాలలో చదువుతున్న తన అక్కలతో రాఖీ కట్టించుకునేందుకు ఓ బాలుడు.. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లాడు. కానీ అక్కడ బాలుడు జితేంద్రను పాఠశాల లోపలికి అనుమతించలేదు గురుకుల సిబ్బంది.
చేసేదేమీ లేక.. జితేంద్ర తన తండ్రి భుజాలపైకి ఎక్కాడు. అక్కలు దాసరి అశ్విక, సహస్ర.. హాస్టల్ గది కిటికీలో నుంచి తమ తమ్ముడు జితేంద్రకు రాఖీ కట్టారు. అనంతరం జితేంద్రకు వారు స్వీటు తినిపించారు. మొత్తానికి అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని ఈ విధంగా చాటాడు జితేంద్ర. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రాఖీ కట్టించుకోవడానికి గురుకులంలోకి లోపలికి అనుమతించని సిబ్బంది.. తండ్రి భుజం ఎక్కి అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు
మంచిర్యాల – రామక్రిష్ణపూర్ సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న అక్కలు దాసరి అశ్విక, సహస్రతో రాఖీ కట్టించుకోవడానికి వెళ్లిన తమ్ముడు జితేంద్రను పాఠశాల… pic.twitter.com/UohNR1VoAo
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | జంపన్న చారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Terrorist Attack | ఉదంపూర్‌లో రెచ్చిపోయిన ముష్కరులు.. కాల్పుల్లో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వీరమరణం
CM Revanth Reddy | తల్లిదండ్రులను కోల్పోయిన దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి బాసట