Terrorist Attack | ఉదంపూర్‌లో రెచ్చిపోయిన ముష్కరులు.. కాల్పుల్లో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వీరమరణం
Terrorist Attack | జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో సోమవారం సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందినట్లు సమాచారం. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలను మోహరించారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
Terrorist Attack | జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో సోమవారం సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందినట్లు సమాచారం. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలను మోహరించారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉదంపూర్‌లోని రామ్‌నగర్‌లోని చీల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బృందం సాధారణ పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కుల్దీప్ వీరమరణం పొందారని ఓ అధికారి తెలిపారు. అయితే, ఉగ్రవాదులకు స్థానికులు సహకారం అందిస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇంతకు ముందు 7న ఉదంపూర్‌లోని బసంత్‌గఢ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ప్రతికూల వాతావరణం, పొగమంచులో ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఉదంపూర్‌లోని బసంత్‌పూర్ ఎగువన ఉన్న అటవీ ప్రాంతంలో గత కొద్దినెలలుగా ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై బలగాలకు సమాచారం అందుతున్నది. అయితే, సహాయం అందించే వారు లేకపోతే అటవీ ప్రాంతంలో ఇంతకాలం దాక్కోవడం సాధ్యం కాదని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. సమాచారం మేరకు ఉగ్రవాదులు స్థానికంగా ఏదో ఒక ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారని.. ప్రస్తుతం అడవులు, పర్వతాలు గుజ్జర్, బకర్వాల్లో అనేక శిబిరాలు ఉన్నట్లుగా అంచనా. ఉగ్రవాదులు బెదిరింపులకు పాల్పడుతూ భోజన ఏర్పాట్లు చేసుకుంటున్నారనే అనుమానాలు సైతం ఉన్నాయి. గత ఏప్రిల్ నుంచి ఈ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

