RS Praveen Kumar | ములుగు : ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువ నాయకులు భూక్య జంపన్న నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంపన్న చారిటబుల్ ట్రస్ట్‌ను ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. సామాజిక సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో జంపన్న నాయక్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఆర్ఎస్పీ ప్రశంసించారు.
జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువత, మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి వారిని స్వశక్తితో స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇవ్వాలని ఆర్ఎస్పీ కోరారు. ఈ సందర్భంగా దివ్యాంగుడైన నగావత్ బాలు నాయక్‌కు ట్రైమోటార్ సైకిల్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా జంపన్న నాయక్ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో #BRS యువ నాయకులు భూక్య జంపన్న నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాను.సామాజిక సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో జంపన్న నాయక్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం.
ట్రస్ట్ ఆధ్వర్యంలో యువత,మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా… pic.twitter.com/xRIJwVQyj5
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 19, 2024
ఇవి కూడా చదవండి..
KTR | రాజీవ్ విగ్రహం పెట్టడమంటే.. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసినట్లే.. : కేటీఆర్
TG Rains | తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Heavy rain | నిజామాబాద్‌లో కుండపోత వర్షం.. వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు