Gadwal | రాజోళి, అక్టోబర్ 23 : ఆ దంపతులకు వివాహమై 14 నెలలు అవుతోంది. భార్య నెలలు నిండిన గర్భిణి. భర్త బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. భార్య తెల్లవారుజామున 4 గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకును చూడకుండా తండ్రి అనంతలోకాలకు చేరిన భర్త అంత్యక్రియల్లో పాల్గొనలేని దుస్థితి ఆమెది.
రాజోళి మండలం తుమ్మలపల్లికి చెందిన కురువ కొత్తకోట శివ(28) మంగళవారం సాయత్రం ద్విచక్ర వాహనంపై వెళ్లే క్రమంలో అదుపుతప్పి కిందపడి గాయాలపాలయ్యాడు. దీంతో ఏపీలోని కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో స్థానికులు చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి గర్భిణీ కావడంతో ఆమె తల్లిగారిల్లు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బలపాలపల్లికి వెళ్లింది. ఆమెకు కూడా పురిటినిప్పులు రావడంతో దవాఖానకు తరలించగా.. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే లోబీపీ ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఆమెకు భర్త మృతి చెందిన విషయాన్ని కుటుంబీకులు చెప్పలేదు. తర్వాత చివరి చూపుకోసం చెప్పడంతో ఆమె రోదన కలిచివేసింది. విధి ఆడిన నాటకంలో ఆమె భర్త అంత్యక్రియలకు సైతం వెళ్లలేకపోయింది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలపై హరీశ్ రావు ఫైర్
KTR | కొండా సురేఖ వ్యాఖ్యలతో నా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నాయి.. కోర్టులో కేటీఆర్