‘నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజోళి మండలంలో ఏ గ్రామానికైనా వెళ్లే దమ్ము నీకుందా’..? అని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నేత కురువ విజయ్‌కుమార్ ప్రశ్నించారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి (Thummilla Lift) నీటి విడుదలపై వివాదం ఏర్పడింది. మంగళవారం ఉదయం రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్టు మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు.