గద్వాల, జూన్ 14 : ‘నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజోళి మండలంలో ఏ గ్రామానికైనా వెళ్లే దమ్ము నీకుందా’..? అని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నేత కురువ విజయ్‌కుమార్ ప్రశ్నించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని ఆందోళన చేసిన రైతులు, స్థానికులపై పోలీసులు కేసు నమోదుచేసి జైలుకు పంపినా.. వారి గురించి సంపత్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
అలంపూర్ ప్రజలు ఛీకొట్టినా సిగ్గులేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో సంపత్‌కు సంబంధించి ల్యాండ్, సాండ్, మైనింగ్ మాఫియా గురించి నిజాలు బయటపెడ్తానని తెలిపారు.