రాజోళి, నవంబర్ 16 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేరుతో కాంగ్రెస్ నాయకులు అక్రమ దందాకు పాల్ప డుతున్నారు. తుంగభద్ర నది లో వరద కొనసాగుతున్న రాత్రి వేళల్లో డ్యాం గేట్లు బంద్చేయించి మరీ అక్రమ దందా చేస్తున్నారు. రాజోళి పరిధిలోని తుంగభద్ర నది నుంచి ఎడ్లబండ్లతో కొంత మంది జీవనోపాధి కోసం నిత్యం ఇసుకను తరలిస్తుంటారు. ఆదివారం పోలీసులు ఎడ్లబండ్లను నదిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారంతా ఎడ్లబండ్లతో రాజోళి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రి వేళలో కొంత మంది కాంగ్రెస్ నా యకులు ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తు న్నా పట్టించుకోని అధికారులు ఎడ్లబండ్లతో ఇసుకను తరలిస్తే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సై స్పంది స్తూ ఎడ్లబండ్లతో రోజుకు 8ట్రిప్పుల ఇసుకను తరలిస్తూ దందా చేయడంతో అడ్డుకోవాల్సి వచ్చిందని వివరించారు.