స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 29 : రాష్ట్రంలో విష జ్వరాలు(Toxic fever) ప్రబలుతున్నాయి. రోగులతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా జనగామ(Janagama) జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని మోడల్ కాలనీకి చెందిన కొరిమి ఆంజనేయులు (48) విష జ్వరంతో గురువారం మృతి(Person died) చెందాడు. తాటికొండ గ్రామానికి చెందిన ఆయన జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం మోడల్ కాలనీకి కుటుంబంతో వచ్చి డీసీఎం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ జనగామలోని ఏరియా హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం 17 వేలకు ప్లేట్లెట్స్ పడిపోవడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించగా ఇంతలోనే ఆంజనేయులు మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.