Will Pucovski : క్రికెట్… ఎంతో మంది కుర్రాళ్లకు, అమ్మాయిలకు కలల ఆట. జాతీయ జట్టుకు ఎంపికైన రోజున, దేశం జెర్సీ వేసుకొని మైదానంలోకి వెళ్లిన రోజున వాళ్ల ఆనందానికి హద్దే ఉండదు. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ విల్ పకోవ్‌స్కీ(Will Pucovski) సైతం అలానే జాతీయ జట్టులోకి రాకెట్లా దూసుకొచ్చాడు. భావి తారగా ప్రశంసలు అందుకున్న ఈ యంగ్‌స్టర్ అర్దాంతరంగా ఆటకు వీడ్కోలు పలికాడు. తాను ఎంతో ప్రేమించిన క్రికెట్‌కు 26 ఏండ్ల వయసులోనే పకోవ్‌స్కీ అల్విదా చెప్పేశాడు. ఇంతకూ ఏం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా యువ కెరటం విల్ పకోవ్‌స్కీ బంగారు భవిష్యత్ అకస్మాత్తుగా ముగిసింది. ఆసీస్ బ్యాటింగ్ స్టార్‌గా ఎదుగుతున్న అతడు ఇక ఆడలేనంటూ శాశ్వతంగా బ్యాట్ పక్కన పడేశాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ సమయంలో పకోవ్‌స్కీ కంకషన్ (Concussion)కు గురయ్యాడు. ఆ తర్వాతి సీరీస్‌లోనూ బంతి పదే పదే అతడి తలకు తగిలింది.
The ball that eventually forced Victorian gun Will Pucovski to retire hurt during his 2nd XI game against South Australia today. Batted on for four balls after being struck before leaving the field of play@wwos #9WWOS #Cricket pic.twitter.com/TPXoZNmXkn
— Will Faulkner (@willzfaulk) January 22, 2024
స్వల్ప కెరీర్లోనే ఈ యంగ్‌స్టర్ తలకు బంతి సుమారు 12 పర్యాయాలు బలంగా తాకింది. దాంతో, అతడు ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతం అయ్యాడు. ఆ పరిస్థితుల్లో మళ్లీ క్రికెట్ ఆడడం దాదాపు కష్టమని వైద్యులు తేల్చారు. అందువల్ల పకోవ్‌స్కీ తన డ్రీమ్ ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు.
A sad ending to Will Pucovski’s highly promising career 🇦🇺
He had taken repeated blows to the helmet over the years 🤕#WillPucovski #Cricketpic.twitter.com/P4CAl4PztV
— Abdullah Neaz 🇧🇩 (@cric___guy) August 29, 2024
జులపాల జుట్టుతో యమ స్టయిలిష్‌గా ఉండే పకోవ్‌స్కీ ఫస్ట్ క్లాస్‌లో చితక్కొట్టాడు. 36 మ్యాచుల్లో ఏడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు బాదేశాడు. మొత్తంగా 45.19 సగటుతో 2,350 రన్స్ కొట్టి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2021లో సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న పక్సోవ్స్కీ భారత్‌పై అరంగేట్రం చేశాడు.
పకోవ్‌స్కీ(62)
ఓపెనర్‌గా సిడ్నీ మైదానంలో టీమిండియా బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న అతడు 62 పరుగులతో రాణించాడు. దాంతో, తమకు ‘సూపర్ స్టార్’ దొరికాడని ఆస్ట్రేలియా క్రికెట్ మురిసిపోయింది. కానీ, కంకషన్ కారణంగా అతడి ఉజ్వల భవిష్యత్తు ఇలా ముగియడం ఆసీస్ సెలెక్టర్లకు, అభిమానులకు మింగుడు పడడం లేదు.