గుడిపల్లి, జనవరి 09 : గుడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా శుక్రవారం సంక్రాంతి రంగవల్లుల పోటీలను విద్యార్థులకు నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క రంగులతో వేసిన అందమైన ముగ్గులు చూపురులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు హరిదాసుల వేశదారణలతో, గంగిరెద్దుల ఆటపాటలతో సంక్రాంతి పండుగ వైభవం చాటారు. వేడుకకు మండల ఇన్చార్జి ఎంఈఓ సముద్రాల శ్రీనయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ బి.కరుణ, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ వెంకటయ్య, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Gudipalli : గుడిపల్లి జడ్పీ హైస్కూల్లో సంక్రాంతి వేడుకలు