Coolie Movie – Nagarjuna | సైమన్‌గా నాగార్జున.. రజనీకాంత్ ‘కూలీ’ నుంచి కింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్
Coolie Movie - Akkineni Nagarjuna | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక నాగార్జున నటిస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్లను ప్రకటిస్తున్నారు మేకర్స్.
Coolie Movie – Akkineni Nagarjuna | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక నాగార్జున నటిస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్లను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శేఖర్ కమ్ముల ‘కుబేర’ మూవీ నుంచి కింగ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇదిలావుంటే తాజాగా రజనీకాంత్ కూలీ నుంచి కింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తలైవ కెరీర్లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీలో
అక్కినేని నాగార్జున ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ కూలీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
నేడు నాగార్జున బర్త్‌డే సందర్భంగా.. విషెస్ తెలుపుతూ.. నాగార్జున లుక్‌ను వదిలారు. ఇక ఈ మూవీలో నాగార్జున సైమన్(Simon) అనే పాత్రలో కనిపించనున్నట్లు లోకేష్ అనౌన్స్ చేశాడు. కాగా ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
Kicked to have King @iamnagarjuna sir joining the cast of #Coolie as #Simon 💥💥
Welcome on board and wishing you a very happy birthday sir🔥🔥@rajinikanth sir @anirudhofficial @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @sunpictures @PraveenRaja_Off pic.twitter.com/Vv7wqA25VA
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 29, 2024
అయితే ఈ మూవీలో తలైవర్‌ను ఢీ కొట్టే పాత్రలో నాగార్జున నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ ఇదే నిజమైతే అటు రజినీ ఫ్యాన్స్‌తో పాటు ఇటు నాగ్ ఫ్యాన్స్ పండగ అని చెప్పుకోవాలి. మరోవైపు నాగార్జున్ ఇంతకుముందు ఓ బాలీవుడ్ చిత్రంలో విలన్ కనిపించి అలరించాడు. దీంతో మరోసారి విలన్‌గా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read..
- Harish Rao | మీడియాపై దాడి కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యమైంది.. మండిపడ్డ హరీశ్‌రావు
- Harish Rao | ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Hydra | పేదల ఇండ్ల జోలికొస్తే సహించేది లేదు : ఎంపీ ఈటల రాజేందర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

