Viduthalai Movie | ఇటీవల మహారాజ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ కథానాయకుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఆయన హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘విడుతలై 2’. కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రి మారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘విడుతలై పార్ట్-1’. కమెడియన్ సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే.
విడుదలై పార్ట్ 2 గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివర దశలో ఉంది. ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న తమిళంతో పాటు తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ పోస్టర్ను పంచుకుంది. అయితే ఈ సినిమా విడుదల రోజునే టాలీవుడ్ నుంచి మరో పెద్ద సినిమా రాబోతుంది. అగ్ర నటుడు రామ్ చరణ్ – శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాత ఇప్పటికే ప్రకటించాడు. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు డిసెంబర్లోనే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mark your calendars! Maverick director #VetriMaaran’s #ViduthalaiPart2 is coming to theatres on December 20, 2024.#ViduthalaiPart2FromDec20
An @ilaiyaraaja Musical @sooriofficial @elredkumar @rsinfotainment @GrassRootFilmCo @ManjuWarrier4 @BhavaniSre @anuragkashyap72… pic.twitter.com/3GQUpSXOvw
— VijaySethupathi (@VijaySethuOffl) August 29, 2024
Also Read..