Hardik Pandya | స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి తన గర్ల్‌ఫ్రెండ్‌తో మెరిశారు. ముంబై (Mumbai)లో జరిగిన ఓ ఈవెంట్ (Event)కు మహియెకా శర్మ (Mahieka Sharma)తో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ చేతులు పట్టుకుని రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఆకర్షించారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘క్యూట్ జోడీ..’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నటాషాతో విడాకులు ప్రకటించిన అనంతరం పాండ్య బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కొన్నిరోజులు డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది కూడా కొన్నిరోజులకే బ్రేకప్ అవ్వగా.. తాజాగా మహియెకా శర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. అందుకు అనుగుణంగానే వీరిద్దరూ అనేకసార్లు కలిసి కెమెరాకు చిక్కారు కూడా. ఇక ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను కూడా తమ ఇన్‌స్టా ఖాతాల్లో షేర్ చేస్తూ తమ బంధం గురించి బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read..
Spying | పాక్ ఐఎస్ఐతో సంబంధాలు.. 15 ఏండ్ల బాలుడు అరెస్ట్
Sonia Gandhi | మరోసారి ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
Shilpa Shetty | శిల్పాశెట్టి దంపతులకు మరోషాక్.. రాజ్ కుంద్రాకు కోర్టు సమన్లు జారీ