Spying | పాక్ (Pakistan) కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే. హర్యానా, పంజాబ్, యూపీలో అనేకమంది గుఢచారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఓ బాలుడు అరెస్ట్ అయ్యాడు.
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలపై 15 ఏండ్ల బాలుడిని (15 Year Old Boy Arrested) పఠాన్కోట్ (Pathankot) పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆ యువకుడు పాక్కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్న హ్యాండ్లర్లతో టచ్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్ములోని సాంబా జిల్లాకు చెందిన బాలుడు దాదాపు ఏడాదిగా భారత సైనిక స్థావరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్లతో పంచుకుంటున్నట్లు గుర్తించామన్నారు. ఇక ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐఎస్ఐ గూఢచర్య కార్యకలాపాల కోసం మైనర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. పంజాబ్లోని పలువురు మైనర్ బాలురకు ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లను అధికారులు అప్రమత్తం చేశారు.
Also Read..
Sonia Gandhi | మరోసారి ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
Shilpa Shetty | శిల్పాశెట్టి దంపతులకు మరోషాక్.. రాజ్ కుంద్రాకు కోర్టు సమన్లు జారీ
Reliance Industries | జామ్నగర్ రిఫైనరీకి రష్యా చమురు కార్గోలు.. ఖండించిన రిలయన్స్ ఇండస్ట్రీస్