Sonia Gandhi | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) మరోసారి ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన దగ్గు (chronic cough)తో ఢిల్లీ (Delhi)లోని సర్ గంగా రామ్ హాస్పిటల్ (Sir Ganga Ram Hospital)లో అడ్మిట్ అయినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఛాతీ వైద్యుల (chest physician) పర్యవేక్షణలో ఉన్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ నగరంలో తీవ్ర కాలుష్యం కారణంగా సోనియా అనారోగ్యానికి గురైనట్లు తెలిపాయి. సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు వెల్లడించాయి.
Also Read..
Shilpa Shetty | శిల్పాశెట్టి దంపతులకు మరోషాక్.. రాజ్ కుంద్రాకు కోర్టు సమన్లు జారీ
Reliance Industries | జామ్నగర్ రిఫైనరీకి రష్యా చమురు కార్గోలు.. ఖండించిన రిలయన్స్ ఇండస్ట్రీస్
Suresh Kalmadi: భారత ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు సురేశ్ కల్మాడీ కన్నుమూత