సిడ్నీ: ఇంగ్లండ్‌తో సిడ్నీలో జరుగుతున్న అయిదో టెస్టు(AUSvENG)లో .. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 518 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఇప్పటి వరకు ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగుల ఆధిక్యం లభించింది. ఆతిథ్య ఆస్ట్రేలియా అయిదో టెస్టులో పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 37వ సెంచరీ నమోదు చేశారు. అతను 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 12 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న స్మిత్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్ మరో సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో మూడోసారి అతను సెంచరీ కొట్టాడు. బేతల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ 163 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఇప్పటికే ఈ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్ బ్రైడన్ కార్స్ 3, బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీసుకున్నారు.
ట్రావిస్ హెడ్ తన బ్యాటింగ్ క్రమంలో సర్ డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును బ్రేక్ చేశాడు. 166 బంతుల్లో 163 రన్స్ చేసి ట్రావిస్ ఔటయ్యాడు. దాంట్లో 24 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. అయితే కేవలం 152 బంతుల్లోనే అతను 150 రన్స్ చేశాడు. యాషెస్ చరిత్రలో ఫాస్టెస్ట్ 150 రన్స్ చేయడం ఇది నాలుగోసారి. ఈ క్రమంలో బ్రాడ్‌మాన్ రికార్డు బ్రేక్ అయ్యింది. 1930లో 166 బంతుల్లో బ్రాడ్‌మాన్ 150 రన్స్ చేశాడు. అయితే యాషెస్ సిరీస్‌లో రెండు సార్లు ఫాస్టెస్ట్ 150 స్కోరు చేసిన బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. 2021లో బ్రిస్బేన్ మ్యాచ్‌లో అతను 143 బంతుల్లో 150 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ పెర్త్‌లో 123, అడిలైడ్‌లో 170 రన్స్ చేశాడు.
Travis Head and Steve Smith stand tall with centuries as Australia take a stranglehold in Sydney 💪#WTC27 | 📝 #AUSvENG: https://t.co/s3J1ihg2Gy pic.twitter.com/vl4TrbVNWC
— ICC (@ICC) January 6, 2026