రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ బ్యాటర్ అమన్ రావ్(Aman Rao) దుమ్మురేపాడు. డబుల్ సెంచరీతో హడలెత్తించాడు. బెంగాల్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో బౌండరీలో మోత మోగించాడు. కేవలం 154 బంతుల్లోనే అతను 200 పరుగులు చేశాడు. అతని డబుల్ సెంచరీలో 12 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. అమెరికాలో పుట్టిన హైదరాబాదీ బ్యాటర్ అమన్ రావ్.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకున్నది. అయితే లిస్ట్ ఏ మ్యాచుల్లో తొలి సారి అతను సెంచరీ చేశాడు. ఇది అతనికి కేవలం మూడో మ్యాచ్ మాత్రమే.
షమీ, ఆకాశ్ దీప్, ముఖేశ్ కుమార్ లాంటి బలమైన బౌలర్లు ఉన్న బెంగాల్ జట్టుపై అమన్ రావ్ డబుల్ సెంచరీ కొట్టడం విశేషం. టాస్ గెలిచిన బెంగాల్ జట్టు.. హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టిన అమన్ రావు.. తన ఖాతాలో డబుల్ సెంచరీ వేసుకున్నాడు. ఆకాశ్ దీప్, షమీ, ముఖేశ్ బౌలింగ్‌లో అతను 120 రన్స్ స్కోరు చేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో ఈ సీజన్లో ఇది రెండో డబుల్ సెంచరీ. ఒడిశా బ్యాటర్ స్వస్తిక్ సమల్ కూడా డబుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.
🏟 21 YEAR OLD AMAN RAO BLASTS 200* OFF 154 BALLS IN THE VIJAY HAZARE TROPHY
RAJASTHAN ROYALS SIGNED AMAN RAO FOR JUST 30 LAKH IN THE AUCTION #AmanRao #VijayHazareTrophy2025 pic.twitter.com/9Pz8LoyzYm
— Rahul Yadav (@RahulYadav61762) January 6, 2026