Tirupathi Reddy | హైదరాబాద్ : హైడ్రా నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశానని తెలిపారు. తనకు ఇల్లును అమ్మిన యజమాని అన్ని అనుమతులతోనే ఇంటిని నిర్మించారని చెప్పారు. కొనుగోలు చేసేటప్పుడు బఫర్ జోన్లో ఉందని యజమాని చెప్పలేదు. తన ఇల్లు బఫర్ జోన్లో ఉందని ఇప్పుడు తనకు నోటీసులు వచ్చాయి. నిబంధనల ప్రకారం లేకుంటే కూల్చేయొచ్చు. సమయం ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతాను అని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు.
తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు గురువారం నోటీసులు అంటించారు. మాదాపూర్‌లోని అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నోటీసులు అంటించారు. మరోవైపు దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు.
నన్ను అడ్డుపెట్టుకొని ఈ కాలనీలో ఉన్న ఇళ్లన్నీ పడగొట్టాలని BRS నాయకులు చూస్తున్నారు
నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ సోదరుడు
2015లో అమర్‌సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశా
కొనుగోలు సమయంలో ఎఫ్టీఎల్లో ఉందనే సమాచారం లేదు
FTLలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు -… pic.twitter.com/2BHo5I5Bin
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | మీడియాపై దాడి కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యమైంది.. మండిపడ్డ హరీశ్‌రావు
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్
Harish Rao | రుణమాఫీ చేయకుండా మోసం చేసిన గజదొంగ రేవంత్ : హరీశ్‌రావు