గురువారం 28 మే 2020
Telangana - May 08, 2020 , 09:52:59

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య

ఆదిలాబాద్‌ : నార్నూర్‌ మండలం కంపూర్‌లో విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి యువతీయువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను గణేశ్‌, సీతాబాయిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

లాక్ డౌన్ కు ముందు గణేశ్, సీతాబాయికి వివాహ నిశ్చితార్థం జరిగింది. కరోనా ప్రబలుతున్న కారణంగా లాక్ డౌన్ ను అమలు చేయడంతో వీరి వివాహన్ని ఇరు కుటుంబాల పెద్దలు వాయిదా వేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. 


logo