Yakshini | బాహుబలి ప్రాంఛైజీతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్టందించింది ఆర్కా మీడియా వర్క్స్ (Arka Mediaworks). ఈ టాప్ బ్యానర్లో పలు హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. కాగా ఆర్కా మీడియా వర్క్స్ తాజాగా కొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు యక్షిని (Yakshini) టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెరకెక్కిస్తున్న యక్షిని టైటిల్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
జోహార్, కోటబొమ్మాళీ పీఎస్ సినిమాలను తెరకెక్కించిన తేజ మర్ణి ఈ సోషియా ఫాంటసీ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ వెబ్‌సిరీస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.