ఖమ్మం: ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతున్నది. ఖమ్మం (Khammam) జిల్లాలోని కూసుమంచి మండలం కేశవాపురం వద్ద ఓ కారు బోల్తాపడింది. దీంతో కారులో భారీగా నగదు బయటపడింది. కారులోని రెండు బ్యాగుల్లో డబ్బును గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు కోటి రూపాయలు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదుచేసి నగదు తరలింపుపై విచారణ చేస్తున్నారు.