Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రం ఆస్పత్రిలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును అపహరించారు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణి నాలుగో కాన్పు కోసం మంగళవారం రాత్రి జిల్లా కేంద్రం ఆస్పత్రిలో చేరింది. సిజేరియన్ ద్వారా మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికే ఆ బిడ్డ కనిపించకుండా పోయింది. దీంతో బాధిత మహిళ, ఆస్పత్రి సిబ్బంది కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే గర్భిణి ప్రసవ సమయంలో ఆస్పత్రి ఆవరణలో ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. ఆ ముగ్గురు మహిళలే శిశువును అపహరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఈ నెల 14 నుంచి అందుబాటులోకి మెయిన్స్ హాల్ టికెట్స్