TGPSC | గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఈ నెల 14 నుంచి అందుబాటులోకి మెయిన్స్ హాల్ టికెట్స్
TGPSC | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో త్వరలోనే హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
TGPSC | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో త్వరలోనే హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. అభ్యర్థులంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్ష జరుగనున్నది. పరీక్ష హాల్లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నట్లు పేర్కొంది. ఇక గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి.
పరీక్షలు ఇలా..
21న జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ )
22న పేపర్-1 (జనరల్ ఎస్ఏ)
23న పేపర్-2 (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం)
24న పేపర్ -3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్)
25న పేపర్ -4 (ఎకానమీ, డెవలప్మెంట్)
26న పేపర్- 5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇన్టర్ప్రెటేషన్
27న పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

