Gandhi Bhavan | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి మాటలు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో.. రేవంత్ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారు. అవకాశం ఉన్న చోట రైతులు నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఓ వృద్ధ రైతు.. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకుని ధర్నాకు దిగాడు. తనకు రుణమాఫీ చేసే వరకు ఇక్కడ్నుంచి కదిలేది లేదని ఆ రైతు తేల్చిచెప్పాడు.
తన పేరు తోట యాదగిరి శాలిగౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గం.. 55 క్వింటాళ్ల 80 కిలోల ధాన్యాన్ని విక్రయించాను. కానీ ఇప్పటి వరకు బోనస్ రాలేదు. అంతే కాదు రుణమాఫీ కూడా కాలేదు.. ఇటు పెన్షన్లు లేవు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు నేను ఇక్కడ్నుంచి కదలను. నేను అబద్ధమాడితే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే అని రైతు తోట యాదగిరి తేల్చిచెప్పాడు.
బ్రేకింగ్ న్యూస్
రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా
వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్
రేవంత్ రెడ్డి రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు.. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికి చేశామని ప్రచారం చేయకండి
పెన్షన్, పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ… pic.twitter.com/T1jhUXv1re
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2025
ఇవి కూడా చదవండి..
Mysterious disease | కొన్నూర్‌లో అంతుచిక్కని వ్యాధి.. మూడు రోజుల్లో 2500 కోళ్లు మృతి
KRMB | కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం వాయిదా.. భేటీకి రాలేమన్న ఏపీ
Jagadish Reddy | ఏపీ నీటి దోపిడీతో.. తెలంగాణలో సాగు, తాగు నీళ్లకు కటకట: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి