Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు (Rajiv Gandhi International Airport) మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. అరైవల్ ప్రాంతంలో ఆర్డీఎక్స్ బాంబు ఉంచినట్లు ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బెదిరింపు మెయిల్ పంపారు. అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా తేల్చినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, రెండు రోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. ఇలా వరుస బెదిరింపులతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Hyderabad, Telangana | A fake bomb threat email sent to the Rajiv Gandhi International Airport (RGIA) yesterday evening turned out to be a hoax. According to officials, an email claimed that an RDX bomb had been placed near the arrival area of the airport. We immediately carried…
— ANI (@ANI) November 22, 2025
Also Read..
Droupadi Murmu | సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా అధ్వానస్థాయిలోనే
Mohan Bhagwat | హిందువులు లేకుండా ప్రపంచం ఉనికే లేదు : మోహన్ భగవత్