Air Pollution | దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం (Air Pollution) కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధ్వానస్థాయిలోనే కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ 359గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. శుక్రవారం ఢిల్లీలో ఏక్యూఐ లెవెల్స్ 364గా నమోదైన విషయం తెలిసిందే. అయితే, నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శనివారం ఉదయం ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక 422గా నమోదైంది. అశోక్ విహార్‌లో 403, బావన ప్రాంతంలో 419, జహన్గిర్పురిలో 417, రోహిణిలో 414, వివేక్ విహార్‌లో 423, నెహ్రూ నగర్లో 402, ఐటీవో ప్రాంతంలో 370, నోయిడా సెక్టార్ 125లో 434గా గాలి నాణ్యత నమోదైంది.
మరోవైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరుబయట ఆటలు, ఇతర కార్యక్రమాలను నిలిపేయాలని పాఠశాలలను ఆదేశించింది. గాలి నాణ్యత ‘తీవ్రమైన’ క్యాటగిరీకి చేరడంతో, సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ ఆదేశాలిచ్చింది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, రికగ్నయిజ్డ్ స్పోర్ట్స్ అసోసియేషన్స్‌కు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
Also Read..
Mohan Bhagwat | హిందువులు లేకుండా ప్రపంచం ఉనికే లేదు : మోహన్ భగవత్
Al Falah University | న్యాక్‌కు అల్ ఫలాహ్ వర్సిటీ క్షమాపణలు
Thane Accident | డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం.. వీడియో