Al Falah University | ఢిల్లీ బాంబు పేలుడు (Delhi Bomb Blast) ఘటన నేపథ్యంలో ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి (Al-Falah University) నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ) షోకాజ్ నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. న్యాక్ నోటీసులకు వర్సిటీ ప్రతిస్పందన తెలియజేసింది. ఈ మేరకు క్షమాపణలు (Apologises) చెప్పింది. వెబ్సైట్-డిజైన్ లోపాల వల్ల అక్రిడిటేషన్ విషయంలో తప్పు జరిగినట్లు పేర్కొంది. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోని తప్పుడు సమాచారాన్ని తొలగించినట్లు వెల్లడించింది.
అల్-ఫలాహ్ వర్సిటీకి న్యాక్ నోటీసులు
ఢిల్లీ బాంబు పేలుడు (Delhi Bomb Blast) ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ (Al-Falah University) పేరు తెరపైకి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో ఈ వర్సిటీ వార్తల్లో నిలిచింది. ఆ విద్యాసంస్థ వెబ్సైట్లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకుగానూ యూజీసీకి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (NAAC) ఇటీవలే షోకాజు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కాలేజీలకు న్యాక్ నుంచి A రేటింగ్ వచ్చిందని పేర్కొనడాన్ని తప్పుబట్టింది. ఇంజినీరింగ్ కళాశాల 2013లో ‘ఏ’ గ్రేడ్ అందుకుందని.. అయితే ఈ గ్రేడ్ 2018 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉందని నోటీసుల్లో పేర్కొంది.
అంతేకాదు డిపార్ట్మెంట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌కు 2011లో ఏ గ్రేడ్ రాగా.. అది 2016 వరకూ మాత్రమే చెల్లుబాటు అవుతుందని వివరించింది. అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా తన వెబ్సైట్లో కళాశాలకు గుర్తింపు ఉందని బహిరంగంగా ప్రదర్శించడాన్ని న్యాక్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించడమే అవుతుందని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
Also Read..
Thane Accident | డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం.. వీడియో
Labour Codes | అమల్లోకి 4 లేబర్ కోడ్లు.. కొత్తగా అమలయ్యే 4 చట్టాలు ఇవే..
కార్మికుల మెడలపై కత్తి.. కార్పొరేట్లకు కొమ్ముకాసేలా 4 లేబర్ కోడ్లు