Droupadi Murmu | రాష్ట్రపతి (President) ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) పుట్టపర్తి (Puttaparthi) చేరుకున్నారు. అక్కడ శ్రీ సత్యసాయి బాబా (Sri Sathya Sai Baba) శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం ప్రశాంతి నిలయంలో జరిగే శతజయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.
VIDEO | Puttaparthi: President of India Droupadi Murmu (@rashtrapatibhvn) and Andhra Pradesh CM N. Chandrababu Naidu (@ncbn) attend centenary celebrations of Sri Sathya Sai Baba.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/9ayklSCIIP
— Press Trust of India (@PTI_News) November 22, 2025
కాగా, రాష్ట్రపతి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేశారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌లో ముర్ముకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా అధ్వానస్థాయిలోనే
Mohan Bhagwat | హిందువులు లేకుండా ప్రపంచం ఉనికే లేదు : మోహన్ భగవత్
Al Falah University | న్యాక్‌కు అల్ ఫలాహ్ వర్సిటీ క్షమాపణలు