హుబ్లీ: జమ్మూకశ్మీర్(Jammu Kashmir) క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీని మొట్ట మొదటి సారి గెలుచుకున్నది. కర్నాటకతో హుబ్లీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన జమ్మూకశ్మీర్ జట్టుకు రంజీ ట్రోఫీ దక్కింది. ఇవాళ అయిదో రోజు జమ్మూకశ్మీర్ బ్యాటర్లు కర్నాటక బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. జేకే బ్యాటర్లు కమ్రాన్ ఇక్బాల్, సాహిల్ లోత్రాలు.. కర్నాటక బౌలర్లను ఆటాడుకున్నారు. ఆ ఇద్దరూ అయిదో వికెట్ అజేయంగా 197 రన్స్ జోడించారు. కమ్రాన్ ఇక్బాల్ 160 , సాహిల్ లోత్రా 101 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నారు. రెండో ఇన్సింగ్‌లో ఇవాళ జమ్మూకశ్మీర్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 342 రన్స్ చేసిన సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జేకే జట్టు మొత్తం 633 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే కర్నాటక, జమ్మూకశ్మీర్ కెప్టెన్లు డ్రాకు అంగీకరించడంతో.. రంజీ ట్రోఫీ జేకే జట్టును వరించింది.
𝗧𝗵𝗲 𝗖𝗿𝗼𝘄𝗻𝗶𝗻𝗴 𝗠𝗼𝗺𝗲𝗻𝘁 🏆
BCCI President Mr. Mithun Manhas (@MithunManhas) & BCCI Hon. Secretary Mr. Devajit Saikia (@lonsaikia) present the coveted Ranji Trophy to captain Paras Dogra as Jammu & Kashmir claim their maiden title. 👏#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/vr0Ag2Quxr
— BCCI Domestic (@BCCIdomestic) February 28, 2026