హాలియా : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు సోమవారం హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు బంధు పథకం కింద ఎనిమిదో విడతగా రాష్ట్ర ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ రైతు బంధు పథకం కింద కారుకు ఎకరాకు 5 వేల రూపాయలు పెట్టుబడి సహాయం, ఏ కారణం చేతనైనా ఒక రైతు మృతి చెందిందే మృతి చెందిన రైతు కుటుంబానికి అండగా రైతు బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు అందజేస్తున్నామన్నారు.
వానకాలంలో రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇప్పటికీ లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరాలను వెల్లడించారు. ఈ యాసంగిలో రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే బీజేపీ నాయకుడు చింతపండు నవీన్ యత్నిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
జయశంకర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. పెండ్లి బృందం వాహనం వెంట పరుగులు
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Telangana | తమిళనాడు బయల్దేరిన సీఎం కేసీఆర్