ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 19:28:10

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఔదార్యం..ఆక్సిజన్ సిలిండర్ల అందజేత

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఔదార్యం..ఆక్సిజన్ సిలిండర్ల అందజేత

వరంగల్ రూరల్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరో మారు తన ఔదర్యాన్ని చాటుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో ముందుండే ఎమ్మెల్యే కరోనా రోగులు ఇబ్బందులు చూసి చలించిపోయారు. స్థానికంగానే పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక చేయూతనిస్తూ ముందుకొచ్చారు. నర్సంపేటలోని ప్రభుత్వ సివిల్ దవాఖానలో కరోనా చికిత్స కోసం తన సొంత ఖర్చులతో ఎమ్మెల్యే ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేశారు.

కరోనా తీవ్రత ఎక్కువైనా రోగులకు ఆక్సిజన్ కొరత రాకుండా సత్వర చికిత్స అందించి ప్రాణాలు కాపాడే అవకాశం కల్పించారు. ఇటీవల కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ నిర్ధారణ అయిన రోగుల కోసం నర్సంపేటలో ఆయన తన సొంత ఖర్చులతో భోజనం, అన్ని వసతులతో కూడిన ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అందులో ఆశ్రయం పొంది కోలుకున్నవారు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆక్సిజన్ బెడ్స్ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో మొట్టమొదటి సారిగా ఆక్సిజన్ సిలిండర్స్ తో కూడిన ఐసోలేషన్ సేవలు ప్రభుత్వ సివిల్ దవాఖానలో అందుబాటులోకి రావటానికి అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రేపటి నుంచి దవాఖానలో అడ్మిషన్స్ ప్రారంభిస్తారన్నారు.

సంబంధిత సిబ్బంది నియామకం, ఇతర పక్రియను కలెక్టర్, ఇతర అధికారులు పూర్తి చేశారని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నర్సంపేటలో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే సేవా గుణాన్నిస్థానిక ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు.


logo