దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు | దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. రోజులు గడిచిన కొద్దీ మహమ్మారి ఉధృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. తాజాగా వరుసగా ఐదో రోజు సోమవారం రికార్డు స్థాయిలో మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,52,991 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే రికార్డు స్థాయిలో 2,812 మరణాలు రికార్డయ్యాయని చెప్పింది. నిన్న ఒకే 2,19,272 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కు చేరింది. ఇప్పటి వరకు 1,43,04,382 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 1,95,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 28,13,658 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. మరో వైపు ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 14,19,11,223 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 14,03,367 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 27.93 శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
కొవిడ్‌పై పోరులో భారత్‌కు యూఏఈ సంఘీభావం
నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
బెంగాల్లో ఏడో విడుత పోలింగ్ షురూ..
విజయనగరంలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో రేపటి నుంచి నైట్‌కర్ఫ్యూ
రిజిస్టరైతేనే వ్యాక్సిన్
ద్రవ ఆక్సిజన్ వైద్యానికి మాత్రమే కేంద్ర హోంశాఖ ఆదేశాలు
Vaccine Doubts : మొదటి డోస్ కోవాగ్జిన్, రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా?
తెలంగాణలో 24 గంటల్లో 43 మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

