IPL 2021 : ఢిల్లీకి షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న అశ్విన్
ఐపీఎల్ నుంచి తప్పుకున్న అశ్విన్ |

న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రసవత్తరంగా సాగుతోంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఐపీఎల్-14 సీజన్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు. ప్రాణాంతక కొవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోంది. చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో గడపాలనే కారణంతో అశ్విన్ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అయితే, పరిస్థితులు చక్కడిన తర్వాతే మళ్లీ మైదానంలోకి దిగుతానని తెలిపాడు. ఇక అశ్విన్ నిర్ణయంపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం స్పందించింది. కష్ట సమయంలో అతడికి పూర్తి అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించింది. అశ్విన్ కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రార్థిస్తోందని, త్వరలోనే అందరూ కోలుకుంటారని ఆకాంక్షించింది. అదే విధంగా.. అశ్విన్ జట్టుతో చేరాలని భావించినపుడు తప్పకుండా అతడు తిరిగిరావొచ్చని పేర్కొంది. సీజనల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటి వరకు అశ్విన్ ఐదు మ్యాచ్‌లు ఆడగా.. ఒక వికెట్ పడగొట్టి, ఏడు పరుగులు తీశాడు.

ఇప్పటికే ఇద్దరు స్వదేశానికి.. అదే బాటలో మరో ఇద్దరు
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇద్దరు క్రికెటర్లు సీజన్ నుంచి ఇంటిదారి పట్టారు. రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా ఆటగాడు అండ్రూ టైతో పాటు ఇంగ్లాండ్‌కు చెందిన మరో క్రికెట్ లియామ్ లివింగ్ స్టోన్ సైతం టోర్నీ నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్లారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బయో బబుల్ సెక్యూర్ వ్యవస్థలో మార్పులు చేసిన కారణంగా అతను స్వదేశానికి వెళ్లాడు. బ్రిటన్ ప్రభుత్వం భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో చేర్చడంతో లివింగ్‌స్టోన్ స్వదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరో వైపు వేర్వేరు జట్లకు ఆడుతున్న మరో ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారని, ఆస్ట్రేలియా ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను కఠినతరం చేసినందున వెనుదిరగాలని భావిస్తున్నట్లు సమాచారం.
I would be taking a break from this years IPL from tomorrow. My family and extended family are putting up a fight against #COVID19 and I want to support them during these tough times. I expect to return to play if things go in the right direction. Thank you @DelhiCapitals 🙏🙏
— Ashwin 🇮🇳 (@ashwinravi99) April 25, 2021
Extending our full support to you in these difficult times, @ashwinravi99 🤝🏽
— Delhi Capitals (@DelhiCapitals) April 25, 2021
Sending you and your family all the strength and prayers from all of us at Delhi Capitals 💙 https://t.co/JoqzDGFVdB
ఇవి కూడా చదవండి..
కొవిడ్‌పై పోరులో భారత్‌కు యూఏఈ సంఘీభావం
నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
బెంగాల్లో ఏడో విడుత పోలింగ్ షురూ..
విజయనగరంలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో రేపటి నుంచి నైట్‌కర్ఫ్యూ
తెలంగాణలో 24 గంటల్లో 43 మంది మృతి
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు
రిజిస్టరైతేనే వ్యాక్సిన్
ద్రవ ఆక్సిజన్ వైద్యానికి మాత్రమే కేంద్ర హోంశాఖ ఆదేశాలు
Vaccine Doubts : మొదటి డోస్ కోవాగ్జిన్, రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

