Kaiserganj | ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ (Kaiserganj) లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి (BJP candidate) కరణ్ భూషణ్ సింగ్ (Karan Bhushan) నామినేషన్ దాఖలు చేశారు. పలువురు పార్టీ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లిన ఆయన నానిమేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది తన జీవితంలోనే అతిపెద్ద క్షణాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కైసర్‌గంజ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనను ఆశీర్వదించండి అంటూ వేడుకున్నారు.
#WATCH | Uttar Pradesh: BJP candidate from Kaiserganj Lok Sabha seat and son of BJP MP Brij Bhushan Sharan Singh- Karan Bhushan files his nomination from Kaiserganj.#LokSabhaElections2024 pic.twitter.com/8WBKXshHYf
— ANI (@ANI) May 3, 2024
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడే కరణ్ భూషణ్ సింగ్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరణ్ భూషణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఈ స్థానం నుంచి ఆయన తండ్రి బ్రిజ్ భూషణ్ వరుసగా మూడు సార్లు గెలుపొందారు. అయితే, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ సారి బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో కుమారుడు కరణ్ భూషణ్‌కు అవకాశం కల్పించింది. 2009, 2014, 2019లో కైసర్‌గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ ఎంపీగా గెలిచారు. అంతకుముందు ఆయన గోండా నియోజకవర్గం నుంచి రెండుసార్లు, బల్రాంపూర్ నుంచి ఒకసారి ఎంపీగా పని చేశారు.
2011 నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా పని చేసిన బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెజ్లర్లు గత ఏడాది ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. మైనర్‌పై లైంగిక వేధింపులతో ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ బ్రిజ్ భూషణ్‌కు టికెట్ ఇస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ అధిష్ఠానం భావించింది. అయితే, ఈ ప్రాంతంలో బ్రిజ్ భూషణ్‌కు పట్టుండటంతో, ఎన్నికల్లో నష్టం జరగకుండా ఉండేందుకు ఆయన స్థానంలో కుమారుడు కరణ్ భూషణ్‌కు టికెట్ ఇచ్చింది. కైసర్‌గంజ్‌కు ఐదో దశలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి.
#WATCH | Uttar Pradesh: BJP candidate from Kaiserganj Lok Sabha seat and son of BJP MP Brij Bhushan Sharan Singh- Karan Bhushan says “This is one of the biggest moments of my life. It feels really good. I want to thank the people of Kaiserganj and request them to keep their… pic.twitter.com/A3pl8iTrm5
— ANI (@ANI) May 3, 2024
Also Read..
Amethi | అమేథి లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన కిశోరీ లాల్ శర్మ
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణను కృష్ణుడితో పోలుస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి
Amethi | కాంగ్రెస్ కంచుకోటలో ‘శర్మ’లు.. మళ్లీ 21 ఏళ్ల తర్వాత అమేథి బరిలో గాంధీయేతరులు