Prajwal Revanna | దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడైన జనతాదళ్ ఎంపీ, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)ను కృష్ణుడి (Lord Krishna)తో పోలుస్తూ కర్ణాటక మంత్రి వివాదానికి తెర తీశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా (Karnataka minister) ఉన్న రామప్ప తిమ్మాపూర్ (Ramappa Timmapur) విజయపురలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రజ్వల్‌ను హిందువుల ఆరాధ్య దైవమైన కృష్ణుడితో పోల్చారు.
‘ఎంబీ పాటిల్ చెప్పినట్లుగా ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలున్న ఈ పెన్‌డ్రైవ్ ఉదంతానికి మించి దేశంలో మరో ఘోరం జరగలేదు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. తనపై భక్తితో ఉన్న పలువురు మహిళలతో శ్రీకృష్ణుడు కలిసి జీవించాడు. అయితే, ఈ కేసులో అలా కాదు. ప్రజ్వల్ ఆ రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు నేను భావిస్తున్నాను’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే, మంత్రి వ్యాఖ్యలపై రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ భగ్గుమంటోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీపై దాడికి దిగింది. తిమ్మాపూర్ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ‘కర్ణాటక ప్రభుత్వంలోని కాంగ్రెస్ నాయకుడు శ్రీకృష్ణుడిని అవమానించారు. ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి, పార్టీ నుంచి తొలగించాలి. లేదంటే మేము నిరసనలకు దిగుతాము’ అని బీజేపీ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి సిటీ రవి అన్నారు.
మరోవైపు, తిమ్మాపూర్ వ్యాఖ్యలకు అధికార కాంగ్రెస్ ఖండించింది. మంత్రి వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఇది పార్టీ అధికారిక అభిప్రాయం కాదని తెలిపింది. రేవణ్ణ ఓ రాక్షసుడని పేర్కొంది.
Also Read..
Prajwal Revanna | లైంగిక దౌర్జన్యం ఆరోపణలు.. ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు
Amethi | కాంగ్రెస్ కంచుకోటలో ‘శర్మ’లు.. మళ్లీ 21 ఏళ్ల తర్వాత అమేథి బరిలో గాంధీయేతరులు
Jewellers store | గోల్డ్ షాప్‌లో పేలిన ఏసీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు