Jewellers store | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రముఖ బంగారం దుకాణంలో (Jewellers store) ఎయిర్ కండీషనర్ పేలింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బళ్లారిలో గల కల్యాణ్ జువెల్లర్స్ షోరూమ్‌లో (Kalyan Jewellers store) గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్టోర్‌లోని ఎయిర్ కండీషనర్స్‌లో ఒకటి పనిచేయకపోగా.. అది ఉన్నట్టుండి పేలింది (Air conditioner explodes ). ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై కల్యాణ్ జువెల్లర్స్ మీడియా ప్రకటన రిలీజ్ చేసింది. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నామని తెలిపింది. మే 2వ తేదీన సాయంత్రం బళ్లారి షోరూమ్‌లోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ మెయింటేనెన్స్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో కాంట్రాక్ట్ ఏజెన్సీకి చెందిన ముగ్గురు వ్యక్తులు, షోరూమ్‌లోని ఇద్దరు ఉద్యోగులు గాయపడినట్లు తెలిపింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం వారు కోలుకున్నట్లు మీడియా స్టేట్మెంట్లో వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపింది.
Also Read..
Prajwal Revanna | లైంగిక దౌర్జన్యం ఆరోపణలు.. ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు
Rinku Singh: రింకూ సింగ్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ.. వీడియో
Congress | హస్తానికి ఓటెయ్యం.. కాంగ్రెస్‌పై సొంత పార్టీ కార్యకర్తల తిరుగుబాటు..