ముంబై: టీ20 వరల్డ్‌కప్ జట్టులో రింకూ సింగ్(Rinku Singh)కు చోటు దక్కని విషయం తెలిసిందే. జూన్‌లో జరగనున్న టోర్నీ కోసం 15 మంది సభ్యులు జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే టీ20 స్పెషలిస్టు బ్యాటర్ రింకూను పక్కన పెట్టడం కొన్ని విమర్శలకు దారి తీసింది. రింకూను ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా ప్రకటించారు. రింకూతో పాటు ఆ జట్టులో శుభమన్ గిల్‌కు కూడా చోటు దక్కలేదు. ఆదివారం వరల్డ్‌కప్ జట్టును ప్రకటించిన తర్వాత మీడియా కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చిన రోహిత్ శర్మ.. అక్కడే వాంఖడే స్టేడియంలో ప్రాక్టీసు చేస్తున్న రింకూ సింగ్‌ను కలిశాడు. ఆ ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. రింకూకు మనోధైర్యాన్ని రోహిత్ ఇచ్చాడు. రోహిత్ తన వద్దకు రావడంతో రింకూ చిరునవ్వు నవ్వాడు. చాలా సీరియస్‌గా ఇద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
ఇండియా తరపున ఇప్పటి వరకు రింకూ సింగ్ 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 89. ఇక స్ట్రయిక్ రేట్ 176.24గా ఉంది. ఉత్తమ ప్రదర్శన ఉన్నా.. వరల్డ్‌కప్‌కు అతన్ని తప్పించారు. రింకూను తుది జట్టు నుంచి తప్పించడం చాలా కఠినమైన నిర్ణయమని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తెలిపాడు. నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయాలన్న ఉద్దేశంతోనే రింకూను పక్కన పెట్టేశామని అగార్కర్ చెప్పాడు. ఇది చాలా దురదృష్టకరమన్నారు.
Match Hitman ke ghar rakhoge toh mehman nawazi ke liye Hitman khud aayega na 😎🫶#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 | @ShreyasIyer15 | @rinkusingh235 | @KonaBharat | @GautamGambhir pic.twitter.com/6W9VRKbZBs
— Mumbai Indians (@mipaltan) May 2, 2024