డోర్నకల్: అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చి, గెలిచిన తర్వాత వాటి అమలును మరచిన కాంగ్రెస్ (Congress) పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రైతులు, సాధారణ ప్రజలే కాకుండా సొంత పార్టీ కార్యకర్తలు కూడా ప్రజాప్రతినిథులు, నాయకులపై తిరుగుబాటు చేస్తున్నారు. మరోసారి హస్తం గుర్తుకు ఓటేసేది లేదంటూ తెగేసి చెబుతున్నారు.
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్‌పై సొంత కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము తిరిగేది లేదని, ఓటు వేసేది లేదంటూ స్పష్టం చేశారు. పార్టీని నమ్మి ఓటేస్తే రైతుబంధు లేదని, నీళ్లు లేవు, రైతు రుణమాఫీ లేదని విమర్శించారు. ఇంకా ఏం మొఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడగాలంటూ తిరగబడ్డారు.
కాంగ్రెస్ పార్టీపై సొంత కార్యకర్తల తిరుగుబాటు
డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేపై సొంత కార్యకర్తల ఆగ్రహం
పార్లమెంట్ ఎన్నికల్లో మేం తిరగం, ఓటు వేయ్యం అంటూ హుకుం జారీ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతుబంధు లేదు, నీళ్లు లేవు, రైతు రుణమాఫీ లేదు, ఇంకా ఏం… pic.twitter.com/NVnbmGbiib
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2024