శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:32

ఉచితంగా నోకియా స్మార్ట్‌ఫోన్లు.. అబద్ధం

ఉచితంగా నోకియా స్మార్ట్‌ఫోన్లు.. అబద్ధం

కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులకు, కార్మికులకు ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ నోకియా ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను అందజేయనుందనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. దాదాపు 20,000 కొత్త ఫోన్లను నోకియా అందజేయనున్నదని, ఫోన్‌ను గెల్చుకోవాలంటే కామెంట్‌ సెక్షన్‌లో ‘ఎన్‌' అని టైప్‌ చేయాలని పోస్ట్‌ చేస్తున్నారు. 

కానీ ఇది అవాస్తవం. ఉచితంగా ఫోన్లు అందజేయనున్నట్లు నోకియా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతేడాది అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 7 మధ్య నోకియా తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఒక పోటీ నిర్వహించింది. పలువురు విజేతలకు నోకియా 7.2 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను అందజేసింది. logo