గురువారం 09 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 13:25:22

భార‌త‌జాతి ఆణిముత్యం పీవీ : క‌విత‌

భార‌త‌జాతి ఆణిముత్యం పీవీ : క‌విత‌

హైద‌రాబాద్ : నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన తెలంగాణ బిడ్డ, భారతజాతి ఆణిముత్యం, బహుభాషా కోవిధుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత కొనియాడారు. 

పీవీ శతజయంతిని పురస్కరించుకుని జాతి యావత్తు గర్వించేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించడం ఎంతో సంతోషిచదగ్గ విషయమ‌ని క‌విత అన్నారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము అని తెలుపుతూ క‌విత ట్వీట్ చేశారు. 


logo