కుమ్రంభీం ఆసిఫాబాద్ : రైలు ఢీకొని(Train collision) 170 గొర్రెలు, 10మేకలు మృతి(Sheep killed) చెందిన సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా(Asifabad district) సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి వర్షం పడటంతో గొర్రెల కాపరులు నిద్రిస్తున్న సమయంలో..గొర్రెలు ఒక్కసారిగా పక్కనే ఉన్నా రైల్వే పట్టాలపై చేరుకున్నాయి. అంతలోనే గుర్తు తెలియని రైలు ఢీకొని శీర్ష గ్రామానికి చెందిన జడ భీమయ్య అనే వ్యక్తికి సంబంధించిన 170గొర్రెలు, 10మేకలు మృతి చెందాయి. ఉదయం చూసే సరికి రైల్వే పట్టాల పై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. గొర్రెలను చూసి కుటుంబ సభ్యులు కన్నింటి పర్వంతమయ్యారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Telangana | గ్రూప్-1పై సర్కారు మొండివైఖరి.. రగులుతున్న నిరుద్యోగ తెలంగాణ
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద.. 18 గేట్లు ఎత్తివేత