మెదక్ : కారును తప్పించబోయి ఓ ఆటో(Auto) చెట్టును ఢీ కొట్టడంతో పలువురు కూలీలు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా(Medak )శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కల వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ఆటో చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను నర్సాపూర్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Bhadrachalam | వరాహ అవతారంలో భద్రాచల రామయ్య..
CM Revanth Reddy | పది రోజులపాటు విదేశాల్లోనే.. సంక్రాంతి తర్వాత సీఎం ఫారిన్ టూర్
Adani | అదానీని వదిలించుకున్న తమిళనాడు.. అంటకాగుతున్న తెలంగాణ!