Wanaparthy | వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెలో బుధవారం భారీ మొసలి ప్రత్యక్షమైంది. బీచుపల్లి అనే వ్యక్తి ఇంటి ఆవరణలో చెట్ల మధ్య మొసలిని చూసిన కుటుంబీకులు భయాందోళకు గురయ్యారు. తక్షణమే వనపర్తి సాగర్ స్నేక్ సోసైటీ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు. ఇక సాగర్ స్నేక్ సొసైటీ సభ్యులు మొసలిని బంధించారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సహాయంతో ఆ మొసలిని కృష్ణా నదిలో వదిలేశారు. ఈ భారీ మొసలి 11 అడుగుల పొడవు.. 230 కిలోల బరువు ఉంటుందని తెలిపారు. ఇక మొసలిని తమ కెమెరాల్లో బంధించేందుకు స్థానికులు ఎగబడ్డారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | భార్యను ముక్కలుముక్కలుగా నరికి చంపి.. కుక్కర్లో ఉడికించిన భర్త
Cold Wave | రాష్ట్రంలో తగ్గని చలి తీవ్రత.. 9 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
KTR | నేడు టెంట్లను కూలగొట్టినట్టే.. రేపు ఏదో దశలో ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు : కేటీఆర్