Hyderabad | హైదరాబాద్ : మీర్‌పేటలో దారుణం జరిగింది. భార్యను దారుణంగా భర్త హతమార్చాడు. ఆపై శరీర భాగాలను ముక్కలుముక్కలుగా చేశాడు. ఆ ముక్కలను కుక్కర్లో ఉడికించి పైశాచిక ఆనందం పొందాడు భర్త. కుక్కర్లో ఉడికించలేని శరీర భాగాలను ఎండలో ఎండబెట్టి, రొకలితో పొడి చేశాడు. అనంతరం కుక్కర్లో ఉడికించిన శరీర భాగాలను, ఎముకల పొడిని జిల్లెలగూడ చెరువులో పడేశాడు.
అయితే భార్య కనిపించడం లేదని ఈ నెల 18న భర్త గురుమూర్తి ఫిర్యాదు చేశాడు. అది కూడా భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. గురుమూర్తి మీదనే పోలీసులకు అనుమానం రావడంతో.. ఆయన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
KTR | నేడు టెంట్లను కూలగొట్టినట్టే.. రేపు ఏదో దశలో ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు : కేటీఆర్
Ginger Water | రోజూ పరగడుపునే అల్లం నీళ్లను తాగితే ఇన్ని ఉపయోగాలా..?