మహబూబాబాద్ , సెప్టెంబరు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులోకం కాంగ్రెస్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. పల్లెపల్లెన యూరియా కోసం ఆందోళనబాట పట్టింది. కాంగ్రెస్ పాలనలో నెల పదిహేను రోజులుగా రైతులకు కంటిమీద కునుకులేదు. రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని అన్నదాతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ఈ క్రమంలో మానుకోట మరోసారి రాళ్లెత్తింది. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని సవాల్ చేసింది. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం యావత్తు ప్రజానీకం.. నేడు యూరియా కోసం రైతులోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్‌రెడ్డి సర్కారు అలసత్వంతోనే సాగు సంక్షోభంలో చిక్కుకుందని అన్నదాతలు నిప్పులు చెరిగారు.
తాజాగా యూరియా గోదాంపై రైతులు విసిరిన రాళ్లు.. ఉద్యమం నాటి మానుకోట ఘటనను మరోసారి కండ్లముందు ఆవిష్కరించాయి. రైతులకు ఇచ్చిన హామీలపై చేతులెత్తేస్తున్నందు వల్లే కాంగ్రెస్ సర్కారుపై రైతులోకం చెయ్యేత్తే పరిస్థితికి దారితీసిందనే అభిప్రాయం వ్యకమతువున్నది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం గంటల తరబడి నిలబడటంతో అలసిపోయి, వెంట తెచ్చుకున్న చాపను రోడ్డుపై వేసుకుని కూర్చున్న రైతు గట్టయ్య
యాదాద్రి భవనగిరి జిల్లా గుండాల పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డ రైతులు, మహిళలు
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో పీఏసీఎస్ వద్ద గంటల తరబడి నిరీక్షించి, యూరియా దొరక్కపోవడంతో రాస్తారోకో చేస్తున్న రైతులు
రంగారెడ్డి జిల్లా మంచాల సహకార సంఘం కార్యాలయం ఎదుట ఉదయం ఐదు గంటల నుంచే యూరియా కోసం వందలాదిగా బారులుతీరిన రైతులు
నిర్మల్ జిల్లా కౌట్ల(కే) గ్రామంలో టోకెన్ల కోసం క్యూలో నిల్చున్న మహిళా రైతులు
కామారెడ్డి జిల్లా గండిమాసానిపేట్ సొసైటీ గోదాం వద్ద యూరియా కోసం పాస్ పుస్తకాలను వరుసలో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో యూరియా కోసం చెప్పులను లైన్లో ఉంచిన రైతులు, ఇదీ రైతుల దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ అన్నదాత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో యూరియా కోసం గ్రోమోర్ సెంటర్‌కు యూరియా వచ్చినా తమకు పంపిణీ చేయడంలేదని రాస్తారోకో చేపట్టిన రైతులు. పాలకుల అండతోనే బ్లాక్ మార్కెట్‌కు సరఫరా చేస్తారేమోనని అనుమానం వ్యక్తంచేశారు.