మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 5 : ప్రభు త్వ జనరల్ దవాఖానలో వైద్య సేవల కోసం వచ్చిన పేద రోగులకు వైద్యసేవలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. దవాఖానలోని వార్డుల్లో పారిశుధ్యం పనులు సరిగా చేపట్టాలని ఓ వైపు కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేక దృష్టి సారించి కొందరి వైద్య సిబ్బందిని శానిటేషన్ వార్టులను శుభ్రంగా ఉంచాలనిన కొంతమంది వైద్య సిబ్బందితోపాటు శానిటరి ఇన్స్పెక్టర్లను పర్యవేక్షించాలని నియమించారు.
దవాఖానలోని వార్డులన్నీ శుభ్రపరిచినా తర్వాత ఆ ఫొటోలను వాట్సాప్ గ్రూప్‌లో పెడతారు, ఆ గ్రూప్‌లో కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో దవాఖాన పరిశుభ్రతపై శానిటేషన్ అధికారులు పారిశుధ్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో కార్మిక సంఘం నాయకుడు సురేశ్ ఆధ్వర్యంలో గత గురువారం విధులు బహిష్కరించి ఆందోళనలు నిర్వహించారు. కార్మిక నాయకుడు సురేశ్ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని సీహెచ్‌వో రాంనాయక్, ఎస్‌హెచ్‌వో నరేందర్ టు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని తెలుసుకున్న కార్మికులు శుక్రవారం విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. సీహెచ్‌వో రాంనాయక్, ఎస్‌హెచ్‌వో నరేంద్ర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో ఆర్ఎంవో డాక్టర్ సమత కార్మికుల వద్దకు వెళ్లి మీ విషయాన్ని సూపరింటెండెంట్‌కు వివరిస్తానని, సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. అనంతరం కార్మికులు కూడా పోలీస్‌స్టేసన్‌కు వెళ్లి సీహెచ్‌వో రాంనాయక్, ఎస్హెచ్వోఓ నరేంద్ర్పై టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు, కార్మికుల గొడవల మధ్య వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.