పెబ్బేరు, సెప్టెంబర్ 5 : పెబ్బేరు మండలంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం విషాదాన్ని నింపిం ది. బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం నిర్వహించి వస్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెం దిన ఘటన పెబ్బేరు మండల పరిధిలో జరిగింది. 44వ నెం బరు జాతీయ రహదారిపై రం గాపురం వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఓ డీసీఎం వాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఎస్సై యుగంధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి మం డలం నాచహళ్లి గ్రామానికి చెందిన కొందరు భక్తు లు బీచుపల్లిలో గణేశుడి నిమజ్జనం చేసి తిరిగి ట్రాక్టరులో వస్తుండగా, వెనుక వైపు నుంచి వేగం గా వచ్చిన డీసీఎం ట్రాక్టరును ఢీకొట్టింది. దీంతో ముందు భాగంలో ని ట్రాక్టరు ఇంజన్‌పై కూర్చున్న సాయితేజ (25), శంకర్ (28)లు కింద పడగా వారిపై నుంచి డీసీఎం దూసుకెళ్లింది. దీంతో వారి శరీర భాగాలు చిధ్రమై పోయి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
ట్రాక్టరుకు మరో పక్క కూర్చున్న అబ్దుల్లా, మహేశ్‌లు తీవ్రగాయాలకు లోనుకాగా వారిని వెంటనే దవాఖానకు తరలించారు. డీసీ ఎం ధాటికి ట్రాక్టరు అర కిలోమీటరు పైగా ముందుకు దూసుకెళ్లగా, ట్రాలీలో ఉన్న ఏడుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతదేహాలను వనపర్తి ఏరియా దవాఖానలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.