Traffic Jam | ఎడతెరిపి లేని వర్షాల కారణంగా దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ-ఎన్సీఆర్లో ఇటీవలే భారీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయిన విషయం తెలిసిందే. రెండు గంటల పాటూ నిరంతరాయంగా కురిసిన వర్షానికి ఢిల్లీ-గురుగ్రామ్ (Gurugram) జాతీయ రహదారిపై 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంటల తరబడి వాహనదారులు రోడ్డుపై ఎటూ కదల్లేక నరకయాతన అనుభవించారు.
ట్రాఫిక్‌కు విసిగిపోయిన ఓ వ్యక్తి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఓ వ్యక్తి సాయంతో తన బైక్‌ను ఏకంగా భుజంపై వేసుకుని నడుచుకుంటూ వెళ్లారు (Man Lifts Scooter Over Head). అతడి చర్యతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌తో అలా చూస్తూ ఉండిపోయారు. కొందరు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘గురుగ్రామ్ ట్రాఫిక్‌కు ఒకే ఒక పరిష్కారం..’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
A post shared by Gurgaon Locals | Food | Travel | lifestyle ✨ (@gurgaon_locals)
Also Read..
Delhi Floods | డేంజర్ మార్క్‌ను దాటి ప్రవహిస్తున్న యమునా నది.. నీట మునిగిన రిలీఫ్ క్యాంప్స్
P Chidambaram | ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు పట్టింది.. టూ లేట్.. జీఎస్టీ తగ్గింపుపై చిదంబరం
Shilpa Shetty | కొత్తగా మీ ముందుకొస్తున్నాం.. రెస్టారెంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి